Income Tax ఆదాయపు పన్ను
Income Tax ఆదాయపు పన్ను
1. ఆదాయపు పన్ను లెక్కించుటకు జీతభత్యాలతోపాటు ఇతరత్రా ఆదాయములను కూడా పరిగణనలోనికి తీసుకొంటారు.
Income Tax ఆదాయపు పన్ను
2. వేతనము, బోనసు, వేతన అద్వాన్సులు, వేతన బకాయిలు, డిఎ, హెచ్ఎర్పా, సిసి,ఎటిఎ, పెన్సన్ ఇంటేరియమ్ రిలీఫ్, డిపాజిట్లు, ఎన్ఎస్సి బాండ్లపై వచ్చు వడ్డీ, సర్వీసులో నున్న వ్యక్తి సరెండరు చేసిన సంపాదిత సెలవు, ప్రోత్సాహక ఇంక్రిమెంట్లు, కంట్రిబ్యూటరీ, పెన్షన్ స్కీంలో ప్రభుత్వం వాటా, జీతపు ఆదాయములుగా పరిగణింద బడతాయి.
3. వేతన ఆదాయం నుండి పొందిన ఇంటి అద్దెను క్రింది షరతులకు లోబడి మినహాయింపు లభించును. 1) వాస్తవముగా పొందిన ఇంటి అద్దె, 2) జీతమునకు 10% పైబడి చెల్లించిన ఇంటి అద్దె, 3) జీతంలో 40% పై మూడింటిలో ఏది తక్కువైతే దానికి మినహాయింపు లభించును. (సెక్షన్ 10).
4. వృత్తి పన్నుకు పూర్తి మినహాయింపు (సెక్షన్ 16) లభించును, కొన్ని నిధులకు, స్వచ్ఛంద సంస్థలకు ఇచ్చిన విరాళాలు (సెక్షన్ 806) చెల్లింపు, కొన్ని పరిమితులతో ఆధారితుల వైద్య ఖర్చు రూ. 75,000/- ల వరకు (సెక్షన్ 80డిడి), మెడికల్ కన్స్యూరెన్సి రూ. 25,000/ -ల వరకు, సీనియర్ సిటిజన్స్ మరియు పేరెంట్స్ సీనియర్ సిటిజన్స్ అయితే రూ. 30,000/-ల వరకు (సెక్షన్ 80డి), తీవ్రరోగాలకై చేసిన వైద్య ఖర్చుల నుండి రూ.40,000/-ల వరకు (సెక్షన్ 80డిడిబి), వికలాంగ ఉద్యోగికి రూ. 75,000/-ల వరకు (సెక్షన్ యు) ఉద్యోగి భార్య/భర్త, పిల్లల ఉన్నత విద్యకి తీసుకున్న ఋణంపై వడ్డీకి (సెక్షన్ 80ఇ) మినహాయింపు ఇస్తారు.
5. గృహ నిర్మాణం / కొనుగోలు నిమిత్తం తీసుకొన్న ఋణంపై వడ్డీ రూ.2,00,000/-ల వరకు మినహాయింపుకలదు. (సెక్షన్ 24బి) దీనికి అదనంగా కొన్ని పరిమితులతో మరోక రూ.50,000/-ల వరకు చెల్లించిన వడ్డీని మినహాయింపు పొందవచ్చు. (సెక్షన్ 80ఇఇ)
6. 80C సెక్షన్ ప్రకారం ఉద్యోగి వివిధ పథకములలో మదుపు చేసిన సొమ్ము 1,50,000 వరకు ఆదాయం నుండి మినహాయించుకొను వీలు కల్పించబడినది. ఈ సెక్షనులో ఉద్యోగికి ఎలసి ప్రీమియం, ప్రావిడెంట్ఫండు చందా, గ్రూప్ ఇన్స్యూరెన్స్, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ VIII, ఇష్యూలో పెట్టుబడి, యూనిట్రంక్ట్ ఇస్స్యూరెన్సు ప్లాను, ప్రభుత్వ ఆమోదము పొందిన సెక్యూరిటీస్లో పెట్టుబడి, నివాస గృహం కొనుటకు / కట్టుకొనుటకు తీసుకొనిన లోను అసలు తిరిగి చెల్లింపు, ఇద్దరు పిల్లలకు వెచ్చించిన ట్యూషన్ ఫీజులు, పోస్టాఫీసు లేదా పబ్లిక్ సెక్టార్ / షెడ్యూల్ బ్యాంకులలో కనీసం 5. సం॥ ఫిక్స్డ్ చేసిన డిపాజిట్లు, సీనియర్ సిటిజన్ స్కీము అన్నింటిని కలిపి ఒక 1,50,000/-ల రూపాయల వరకు మదుపుకు మినహాయింపు లభించును.
7 . సెక్షన్ 80సిసిజి ప్రకారం మదుపు సొమ్మును అదనంగా 50వేల వరకు రాజీవ్ గాంధీ ఈక్విటీ స్కీంలో మదుపు చేసి ఆదాయం నుండి 25వేల వరకు మినహాయింపు పొందవచ్చును.
8. పెన్షన్ ఫండ్ క్రింద జీవనసురక్ష పాలసీ ప్రీమియం రూ. 10,000/- పన్నుకు అర్హతగల ఆదాయం నుండి 80సిసిసి ద్వారా మినహాయింపు లభించును.
9. 01.01.2004 నుండి ప్రారంభించబడిన నూతన పెన్షన్ పథకమునకు జనకావించబడిన సొమ్మును 10% జీతమునకు మించకుండ (80సిసిడి-1) మరియు ప్రభుత్వ కంట్రిబ్యూషన్ జీతంలో 10% (80సిసిడి-2)గరిష్ఠంగా మినహాయింపు సెక్షన్ 80సిసిడిలో లభించును. కాని సెక్షన్ 80సి, 80సిసిసి మరియు 80సిసిడి మొత్తము 1.50,000/-లకు పరిమితి విధించబడింది. దీనికి అదనంగా నూతన పెన్షన్' స్కీమ్లో చెల్లించిన మొత్తం రూ.50,000/-ల వరకు మినహాయింపు పొందవచ్చు. (80 సిసిడి-1బి)
10. పై మినహాయింపులు పోను వచ్చిన ఆదాయమునకు క్రింద తెలిపిన విధముగా పన్నును లెక్కకట్టాలి
Comments
Post a Comment