Teachers Welfare Fund ఉపాధ్యాయ సంక్షేమ నిధి
ఉపాధ్యాయ సంక్షేమ నిధి (TEACHERS' WELFARE FUND): నేషనల్ ఫౌండేషన్ ఫర్ టీచర్స్ వెర్సర్ వారు ప్రతి సంవత్సరం సర్వీసులో వున్న మరియు రిటైరైన ఉపాధ్యాయులకు ఆర్థిక సహాయం చేస్తారు. దీనికి సంబంధించిన దరఖాస్తులను జిల్లా విద్యాశాఖాధికారి ద్వారా ప్రకటించిన తేదీలోపల వంపుకొవాలి. సాధారణంగా జూన్ చివరిలోగా దరఖాస్తులు డిఇఓగార్ని వంపాలి.
దరఖాస్తు చేయదగిన ప్రాథమిక, సెకండరీ పాఠశాలల ఉపాధ్యాయులు
1) సర్వీస్ ఉపాధ్యాయులు 2) 21, 10.1974కు పూర్వం ప్రైవేలేతర పాఠశాలల్లో పనిచేస్తూ చనిపోయిన వారిపై ఆధాయిపడినవారు, 3) 03.07,1980కి పూర్వం ప్రైవేటు పాఠశాలల్లో పనిచేస్తూ చనిపోయిన వారిపై ఆధారపడినవారు, 4) 01.04. 1973 కు పూర్వం రిటైరైన వారు. (కాలేజ్ టీచర్లకు సైతం దాదాపు పై నిబంధనలు వర్తిస్తాయి).
ద్రన్న సహాయం ఈ క్రింది కారణాలపై మంజూరు చేస్తారు.
1) ఉపాధ్యాయులు, లేదా వారిపై ఆధారపడిన వారు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులయినప్పుడు, 2) కుమార్తెల వివాహ ఖర్చుల నిమిత్తం, 3) అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు, 4) వరదలలో తీవ్రమైన నష్టాలకు గురయినప్పుడు, 5) ఇంటర్మీడియేట్ కంటే పై స్థాయి విద్యను పిల్లలు చదువుతున్నప్పుడు ఖర్చుల నిమిత్తం..
దరఖాస్తు చేయు విధానం- షరతులు
- పైన పేర్కొన్న మొదటి నాలుగు కారణములపై దరఖాస్తులను దూప్లికేట్లో డి.ఇ. గార్కి పంపాలి.
- వైద్య సహాయం నిమిత్తం దరఖాస్తు చేసేవారు తమ వ్యాధి స్వభావాన్ని విస్పష్టంగా తెలిసేలా ఎంబిబిఎస్కు తక్కువగాని అర్హతగల డాక్టరు నుండి పొందిన సర్టిఫికెటు జతపరచాలి.
- దరఖాస్తు దారునిపై ఆధారపడిన వారి పిల్లల వయస్సు. ఆదాయ వివరాలు తెలియజేయాలి.
- దరఖాస్తు దారుని భార్య / భర్త / పిల్లల వయస్సు, ఆదాయ వివరాలు తెలియజేయాలి.
- తమ పిల్లలు ఇంటర్మీడియటకు పైబడిన విద్యాభ్యాసం చేస్తున్నప్పుడు మాత్రమే ఈ సహాయం లభిస్తుంది. దీనికై అప్లయి చేసేవారు కోర్పు, బాలపరిమితి తదితర వివరాలు తెలపాలి. స్కాలర్షిప్పులు పొందుతున్న పక్షంలో ఈ కారణంపై దరఖాస్తు చేయరాదు.
- కుమార్తెల వివాహం విషయంలో వారి వయస్సు, ఆదాయం, ఉద్యోగ వివరాలు విధిగా తెలపాలి
- ఉద్యోగంలో వున్నవారు తాము పనిచేసే పాఠశాలల ప్రధానోపాధ్యాయుల ద్వారా, రిటైరైన వారు తాము పనిచేసిన చివరి పాఠశాల ప్రధానోపాధ్యాయుని ద్వారా దరఖాస్తు పంపాలి. చనిపోయిన వారి వారసులు సైతం ఉపాధ్యాయుడు / ఉపాధ్యాయిని పనిచేసిన చివరి పాఠశాల ప్రధానోపాధ్యాయుని ద్వారానే పంపాలి.
పిల్లల చదువు నిమిత్తం ఆర్థిక సహాయం
- 4 సం॥లు (8 సెమిస్టర్లు) కల్గిన ఇంజనీరింగ్ డిగ్రీ కోర్సు, మూడు సం॥లకు తక్కువ కాకుండా వుండే డిప్లమో కోర్సులకు, అల్లోపతి, హోమియోపతి, ఆయుర్వేద వైద్య విద్యలకు, పశు వైద్య కోర్సులకు, డిగ్రీ తరువాత చేసే 2 సం॥లు తక్కువ కాని మేనేజ్మెంటు కోర్పులకు, రెండు సం॥లు తక్కువగాని 'బి' ఫార్మసీ డిప్లమా కోర్సులకు ఇది వర్తిస్తుంది. ఆర్ధిక సహాయం రూ.15,000/-ల గరిష్ఠ పరిమితితో చేస్తారు.
- ట్యూషన్ / లైబ్రరీ / లాబొరేటరీ ఫీజులు అనుమతించబడతాయి.
- విద్యార్థి ఒకే పర్యాయములో ఉత్తీర్ణత పొందవలెను. సప్లిమెంటరీలో ఉత్తీర్ణత పొందితే అర్హుడు కాదు. ఇతర స్కాలర్ విద్యార్థి గత సంవత్సరం కోర్సులో జాయిన్ అయినా దరఖాస్తు చేసుకొనవచ్చును. కాని అరియర్స్ చెల్లించబడవు.
- సిప్పులు పొందే కాలములో అర్హులు కారు.
- ఆప్లికేషన్ ఫారం (అనెగ్జర్-సి) (అ.ద. 18, పేజి 320లో కలదు),
- ఉపాధ్యాయుడి సెల్ఫ్ డిక్లరేషన్,
- జీతపు ధృవపత్రము,
- ఒరిజినల్ ఫీజు రశీదులు (జిరాక్సులు అంగీకరించ ఐడవు),
- తల్లి లేదా తండ్రి సంరక్షణలో ఉన్నట్లు ప్రిన్సిపాల్ / హెచ్ఎం చే ఇవ్వబడిన స్టడీ సర్టిఫికెట్ (ఇన్చార్జి సంతకములు అంగీకరించబడవు),
- దరఖాస్తులను ఉపాధ్యాయులైతే ఎంఇఓ/హెచ్ఎం ద్వారా, ప్రధానోపాధ్యాయులైతే డివైఇజ్ ద్వారా సెప్టెంబరు 30లోగా పాఠశాల విద్యా సంచాలకుల కార్యాలయాలకు పంపుకోవాలి.
Comments
Post a Comment