Fundamental Rules - Fixations Increments ఫండమెంటల్ రూల్సు - ఫిక్సేషన్లు, ఇంక్రిమెంట్లు
Fundamental Rules - Fixations Increments ఫండమెంటల్ రూల్సు - ఫిక్సేషన్లు, ఇంక్రిమెంట్లు
ఒక ఉద్యోగి వేరొక పోస్టునందు నియమించబడినప్పుడు లేక ప్రమోషను పొందినప్పుడు ఫండమెంటల్ రూల్స్ 22,30,31 ననుసరించి అతని వేతన స్థిరీకరణ జరుగుతుంది. అయితే ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వులిచ్చిన సందర్భంలో బాధ్యత మార్పుతో సంబంధం లేకుండగనే ఈ నిబంధనల ప్రకారము వేతన స్థిరీకరణ చేయబడుతుంది. సెలక్షన్ గ్రేడు, | 6/12/18/24 సంవత్సరముల స్కేల్పు, రివైజ్డ్ పే స్కేల్సు, మొగవానియండు ఆ విధంగానే వేతన స్థిరీకరణ చేయ బడుచున్నది.
Fundamental Rules - Fixations Increments ఫండమెంటల్ రూల్సు - ఫిక్సేషన్లు, ఇంక్రిమెంట్లు
అట్లే ఉద్యోగి యొక్క సర్వీసును బట్టి ఇంక్రిమెంట్లు మంజూరు చేయబడతాయి. వార్షిక ఇంక్రిమెంట్లు, మంజూరు, ప్రీపోన్మెంటు, పోస్టు పోన్మెంటు మొదలుగునవి ఫండమెంటల్ రూల్సు 24.26,27 ననుసరించి చేయబడతాయి.
F.R.22(a) (i) :
అదనపు బాధ్యతలతో కూడిన పోస్టునందు నియమించబడినప్పుడు, నూతన స్కేలు నందలి 'తదుపరి పై స్టేజి' వద్ద వేతన స్థిరీకరణ జరుగును. అట్టి వేతన స్థిరీకరణ జరిగిన తేదీ నుండి 12 నెలల సర్వీసు నిండిన పిదప ఇంక్రిమెంటు ఇవ్వబడుతుంది.
ఉదా : 21,230-63,010 స్కేలులో రూ. 25,840/- వేతనము తీసుకొనే ఉద్యోగి 28,940- 78,910 స్కేలు గల పోస్టులో నియమించబడినప్పుడు అతని వేతనము రూ. 28,940గా స్థిరీకరించబడుతుంది.
F.R.22(a) (II) :
అదనపు బాధ్యతలు లేని పోస్టునందు నియమించబడినప్పుడు, నూతన స్కేలు నందలి 'దిగువ స్టేజి' వద్దనే వేతన స్థిరీకరణ జరుగుతుంది. అయితే -
ఎ) ఒకవేళ పాత స్కేలులోని మూల వేతనమునకు సరిసమానమైన స్టేజి నూతన స్కేలులో వున్నచో అట్టి 'సమాన స్టేజి' వద్ద వేతన స్థిరీకరణ జరుగుతుంది. పాత ఇంక్రిమెంటు తేదీ కొనసాగుతుంది. ఉదా : 21,230-63,010 స్కేలులో రూ. 30,580/-లు వేతనం పొందుతున్న ఉద్యోగి 28,940- 78,910 స్కేలులో నియమించబడినప్పుడు అతని వేతనము రూ.30,580ల వద్దనే స్థిరీకరించ బడుతుంది.
బి) ఒకవేళ పాత స్కేలులోని మూలవేతనమునకు సమానమైన స్టేజి లేనిచో దిగువ స్టేజి వద్ద వేతన స్థిరీకరణ జరుగుతుంది. వేతన వ్యత్యాసము 'పర్సనల్ పే'గా నమోదు చేయబడుతుంది. పాత ఇంక్రిమెంటు తేదీ కొనసాగుతుంది. (93,99,05,10, 15 స్కేళ్ళలో అన్నీ సమాన స్టేజీలే వుంటాయి. కనుక 86 స్కేళ్ళలో ఉదా ॥ చూడాలి) ఉదా : 1010-1800 స్కేలులో రూ.1360/-లు పొందుచున్నచో 1280-2440 స్కేలులో రూ. 1330+30 పిపిగా వేతన స్థిరీకరణ జరుగుతుంది.
సి) పాత స్కేలులోని మూలవేతనము నూతన స్కేలు యొక్క మినిమం కంటే తక్కువగా నున్నప్పుడు. అట్టి మినిమం వద్ద వేతన స్థిరీకరణ జరుగుతుంది. సంవత్సరం సర్వీసు తదుపరి మాత్రమే ఇంక్రిమెంటు ఇవ్వబడుతుంది.
F.R.22(a) (Ill) :
ఉద్యోగి కోరికపై క్రింది స్థాయి పోస్టులో నియమించబడినప్పుడు అతని వేతనము ఎస్ఆర్ 22(ఎ)
(iii) లోని విధానము ననుసరించి స్థిరీకరించబడుతుంది.
F.R.22(a) (iv) :
ఉద్యోగి పబ్లిక్ సర్వీస్ కమీషన్చే ఎంపిక చేయబడిన మరొక పోస్టులో నేరుగా నియమించ బడినప్పుడు పాత పోస్టులోని వేతనమునకు తక్కువ కాకుండా క్రొత్త పోస్టులోని వేతనము స్థిరీకరించబడుతుంది
Comments
Post a Comment