ఉద్యోగుల సంక్షేమ నిధి (Employees Welfare Fund)
ఉద్యోగుల సంక్షేమ నిధి (Employees Welfare Fund): జిఓ.(పి)సం. 173 ఆర్థిక, తేది. 28,05, 1980 ద్వారా ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల సంక్షేమ నిధి ఏర్పాటు చేయబడినది. / ఈ నిధికి మూడు విధములుగా డబ్బు సమకూరుతుంది. అవి 1) సభ్యుల చందా, 2) ప్రభుత్వ గ్రాంటు, 3) విరాళములు. ఈ నిధిపై వడ్డీ నుండి ఉద్యోగుల సంక్షేమ కార్యములకు సహాయము మరియు అప్పులు ఇవ్వబడతాయి.
ఉద్యోగుల సంక్షేమ నిధి (Employees Welfare Fund)
సభ్యులు : 01.04.1979న లేక ఆ తదుపరి ప్రభుత్వ, స్థానిక, ఎయిడెడ్, సంస్థలలోనియమించబడిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఇందులో సభ్యులు. 'అత్యవసర ఉద్యోగులు' తప్ప మిగిలిన తాత్కాలిక, రెగ్యులర్, శాశ్వత ఉద్యోగులందరు తప్పనిసరి సభ్యులగుదురు.
సభ్యత్వం : 1979 మార్చిలో చెల్లించబడినవారు రూ. 25/-ల ఇంటెరిమ్ రిలీఫ్ ప్రారంభ చందాగా వసూలు చేయబడినది. 01.07.1979 నుండి నియమించబడినవారు రూ. 25/-ల ప్రారంభ చందాను ఐదు సమాన వాయిదాలలో చెల్లించి వుండాలి. 01.04.1992 తదుపరి నియమించబడిన వారు ప్రారంభ చందాగా రూ. 50/ -లు చెల్లించాలి. అది వారి మొదటి జీతము నుండి మినహాయించబడుతుంది. ప్రతి సంవత్సరం మార్చినెల జీతము నుండి వార్షిక చందా రికవరీ చేయబడుతుంది. మొదట రూ. 5/- లుగా నున్న వార్షిక చండా 1992 మార్చి నుండి రూ.10/-లుగా పెంచబడినది. 01.03.2006 నుండి రూ.20/- గా పెంచబడినది.
నిధి నిర్వహణ-కమిటీలు : ఈ నిధిని నిర్వహించుటకు రాష్ట్ర స్థాయిలో చీఫ్ సెక్రటరీ చైర్మన్ గా, ఆర్థికశాఖ జాయింట్ సెక్రటరీ మెంబర్ సెక్రటరీ-కం-ట్రెజరర్గా ఒక కమిటీ వుంటుంది. అట్లే జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్ చైర్మన్, | జిల్లా ట్రెజరీ అధికారి మెంబర్ సెక్రటరీ-కం-ట్రెజరర్గా ఒక కమిటీ వుంటుంది. జంట నగరాలకు జిఏడి డిపార్ట్మెంట్ సెక్రటరీ అధ్యక్షుడుగాను, ట్రెజరీస్ & అక్కౌంట్స్ డెప్యూటీ డైరెక్టరు మెంబర్ సెక్రటరీ-కం-ట్రెజరర్గా | ప్రత్యేక కమిటీ వుంటుంది. ప్రభుత్వ గుర్తింపు గల ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలన్నీ కమిటీలలో సభ్యులుగా | వుంటాయి. జిల్లా / జంటనగరాల కమిటీలు రాష్ట్ర కమిటీ తమకు కేటాయించిన మొత్తముల నుండి అప్పులు, గ్రాంటులు మంజూరు చేస్తాయి.
అప్పులు: వివాహములు, పిల్లల చదువులు, వైద్య ఖర్చుల నిమిత్తం సభ్యులకు ఈ నిధి నుండి అప్పు ఇవ్వబడుతుంది. సాధారణ వడ్డీతో కలిపి దానిని 5 సం॥లలో తిరిగి చెల్లించాలి. వైద్య ఖర్చులకై రూ.50వేల వరకు, పిల్లల విదేశీ చదువులకై రూ.25 వేల వరకు అప్పు మంజూరు చేయబడుతుంది.
ఆర్ధిక సహాయము : వైద్య ఖర్చులు, పిల్లల చదువులు, ఆచార సంబంధమైన కార్యములకు రూ. 1000/-ల వరకు | ఉచిత ఆర్థిక సహాయము ఇవ్వబడుతుంది.
నిమ్సు (హైదరాబాద్), స్విమ్స్ (తిరుపతి)లలో ఆపరేషన్ చేయించుకొన్న వారికి పూర్తిగాను, ఇతర వైద్య శాలలలో ఆపరేషన్ చేయించుకొన్న వారికి రూ. 10,000/-లకు మించకుండా అప్పు ఇస్తారు. రీయింబర్సుమెంట్ అర్హతలగలవారికి | రీయింబర్స్మెంట్ పోను అదనపు మొత్తానికి రూ. 10,000/- మించకుండా అప్పు ఇస్తారు.
గృహ నిర్మాణము, కొనుగోలు లేక మరమ్మత్తుల నిమిత్తము ఈ నిధి నుండి అప్పుగాని, సహాయముగాని లభించదు. దరఖాస్తు : అప్పుకై లేక ఆర్థిక సహాయమునకై దరఖాస్తును నిర్ణీత ఫారంలో రాష్ట్ర కమిటీ యొక్క మెంబర్ సెక్రటరీ - కం-ట్రెజరర్ మరియు ఆర్థికశాఖ ఆడిషనల్ సెక్రటరీ గారికి సంబంధిత అధికారుల ద్వారా పంపుకోవాలి
Comments
Post a Comment