AP Subordinate Service Rules | ఎ.పి. స్టేట్ & సబార్డినేట్ సర్వీస్ రూల్సు 1996
రాష్ట్ర ప్రభుత్వ యాజమాన్యమునగల గజిటెడ్, నాన్ గజిటెడ్ పోస్టులకు సంబంధించి డిపార్టుమెంట్ల వారీగా వేర్వేరు. కి నిబంధనలు గలవు. వాటన్నిటికి వర్తించెడి సాధారణ నిబంధనలు, ప్రత్యేక నిబంధనలు, తాత్కాలిక విబంధనలు దిల్ అండ్ సబార్డినేట్ సర్వీసు రూల్స్- 1996 పేరున జిఓ, ఎంఎస్ నం. 186 జిపిడి తేది. 15/10/1996 అధ్యాపక, చర్శిని-15 ద్వారా ఇవ్వబడినవి. 5. ఉద్యోగుల సర్వీసుకు సంబంధించి సాధారణంగా వాడబడెడి - క్యాడర్, డ్యూటీ, రెగ్యులర్ అపాయింట్ మెంట్, ప్యానల్, ప్రొబేషన్, అప్రూవ్డ్ క్యాండిండేట్, సర్వీస్ మున్నగు పదముల నిర్వచనములు రూలు-2 నందు ఇవ్వబడినవి. నియామకము : ఆయా ప్రభుత్వ సర్వీసు లందు నియామకము 4 విధములుగా జరుగును. అవి 1) క్రొత్తవారిని ఎంపికచేసి, నియమించు "డైరెక్ట్ రిక్రూట్మెంట్" 2) ఇతర సర్వీసు లేక అదే సర్వీసుకు చెందిన మరొక సమాన స్థాయి పోస్టు నుండి నియమించు రిక్రూట్మెంట్ ట్రై ట్రాన్స్ఫర్ 3) ప్రమోషన్ 4) కాంట్రాక్టు అగ్రిమెంటు పద్ధతిపై
AP Subordinate Service Rules | ఎ.పి. స్టేట్ & సబార్డినేట్ సర్వీస్ రూల్సు 1996
నియామకము:
నియమ నిబంధనలన్నిటిని పాటించి నియమించుట ఆలస్యమునకు కారణమగు సందర్భములో ప్రజా ప్రయోజనాల
రీత్యా నియామకాధికారి ఒక వ్యక్తిని తాత్కాలిక ప్రాతిపదికన నియమించవచ్చును. (రూలు 10). ఒకే సర్వీసుకు చెందిన ఒక క్యాటగిరి నుండి వేరొక క్యాటగిరికి ప్రమోషన్ పొండవలెనన్నను. ఒక సర్వీసు నుండి మరియొక సర్వీసునకు బదిలీపై నియామకము పొందవలెనన్నను ఉద్యోగి తాను ప్రస్తుతము పని చేయుచున్న క్యాడరునందు ప్రొబేషన్ను పూర్తిచేసియుండాలి. (రూలు 8)
డైరెక్టు రిక్రూట్మెంట్ అర్హతలు:
ఎ) మంచి ఆరోగ్యము, అలవాట్లు గలిగి, సంబంధిత పోస్టులో పని చేయుటకు తగిన శారీరక దారుధ్యము కలిగి వుండాలి. బి) నుంచి నడవడి, ప్రవర్తన కలిగియున్నట్లు నివేదిక వుండాలి.సి) పోస్టుకు అవసరమైన విద్య, ఇతర అర్హతలు కలిగి వుండాలి. డి) నిర్ణీత వయోపరిమితి కలిగి వుండాలి. (రూలు 12)
ఆం.ప్ర. పబ్లిక్ సర్వీసు కమీషన్ పరిధిలోని పోస్టుల విషయములో స్క్రీనింగ్ కమిటీతోను, పబ్లిక్స ర్వీసు కమీషన్తో సంబంధంలేని పోస్టుల విషయంలో డిపార్టుమెంటల్ ప్రమోషన్ కమిటీ (డిపిసి) తోను సంప్రదించిన మీదట నియామక అధికారి అప్రూవ్డ్ క్యాండిడేట్స్ ప్యానల్ను తయారు చేయును. రానున్న సంవత్సరం ఆగస్టు 31 వరకు ఏర్పడు ఖాళీలకై 1:3 నిష్పత్తిలో అర్హులైన వారి ప్యానల్ తయారు చేయబడును. (రూలు 6) విధులలో చేరుటకు గడువు: డైరెక్ట్ రిక్రూట్మెంట్ క్రింద నియమించబడినవారు నియామక ఉత్తర్వులు రిజిష్టరు పోస్టు ద్వారా పంపబడిన తేదీ నుండి 30 రోజులలోగా విధులలో చేరాలి. ప్రమోషన్పై నియమించబడిన వారు ఉత్తర్వులు అందిన 15 రోజులలోగా విధులలో చేరాలి. అట్లు 15 రోజులలో విధులలో చేరని వారు మరుసటి సంవత్సరం ప్రమోషన్ ప్యానల్లో చేర్చబడతారు. (జిఓ 145 జిఏడి, తేది. 15.06.2004) సెలక్షన్ లిస్టు: నియామకముపై రూలు-22లో ఇవ్వబడిన రోస్టర్ పాయింట్ల ప్రకారము సెలక్షన్ లిస్ట్ (మెరిట్- కం- కమ్యునల్ రోస్టర్) తయారు చేయబడును. పూర్తి వివరములు ప్రక్క పేజీలో ఇవ్వబడినవి.
టెస్టులు: ఎ) ప్రొబేషన్ పీరియడు పూర్తగులోగా తెలుగుభాషా పరీక్ష పాస్ కావాలి. అయితే ఎస్ఎస్సి లేక తత్సమాన పరీక్షను తెలుగు మాధ్యమంగా పాసయిన వారికి మరియు 45 సంవత్సరముల వయస్సు నిండినవారికి మినహాయింపు ໖. ( 13 & 14)
బి) క్రొత్తగా నిర్దేశించిన డిపార్ట్మెంటల్ పరీక్షలను ప్రొబేషన్ను పీరియడులోగా లేక ప్రమోషను పొందిన తదుపరి నిర్వహించబడిన రెండు పరీక్షల కాలములోగా, ఏది తర్వాత అయితే దానిలోగా పాస్కోవాలి. (రూలు 15)
సీనియార్టీ:
ఒక ఉద్యోగి సీనియార్టీ అతడు ఉద్యోగములో చేరిన తేదీ నుండి లెక్కించబడుతుంది. (రూలు 33ఎ) అయితే నియామకముల నిమిత్తము నియామకాధికారి అభ్యర్థుల జాబితా తయారు చేసి వున్నచో సదరు జాబితాలోని క్రమము ప్రాతిపదికగా అతని సీనియార్టీ నిర్ణయించబడుతుంది. (రూలు 33బి)
ప్రొబేషన్ పిరియడ్:
డైరెక్ట్ రిక్రూట్మెంట్ వారి విషయములో నియామకపు తేదీ నుండి మూడు సంవత్సరాల అవిచ్ఛిన్న కాలములో 2 సంవత్సరములు, ప్రమోషన్పై నియామకము పొందిన వారి విషయములో 2 సంవత్సరముల అవిచ్ఛిన్న కాలములో 1 సంవత్సరము సర్వీసు ప్రొబేషన్ పిరియడ్గా పరిగణించబడుతుంది. (రూలు 16) సమర్థవంతంగా పనిచేసినట్లు ప్రొబేషన్ డిక్లరేషన్ జరిగితే అట్టి ఉద్యోగి సర్వీసులో స్థిర పరచబడును. (రూలు 21)
Comments
Post a Comment