అప్పులు అడ్వాన్సులు జిఓ ఎంఎస్ నం. 167 ఆర్థిక; తేది. 20.09.2017
అప్పులు అడ్వాన్సులు జిఓ ఎంఎస్ నం. 167 ఆర్థిక; తేది. 20.09.2017
పండుగ అడ్వాన్సు : 2015 పీఆర్సీస్కేళ్ళలో 26,600-77,030 స్కేలుగాని, అంతకు తక్కువ స్కేలుగాని కలిగియున్న ఉద్యోగులకు రూ. 7500/-ల చొప్పునను, 4వ తరగతి ఉద్యోగులకు రూ. 5000/-ల చొప్పునను పండుగ అడ్వాన్సు | మంజూరు చేయబడుతుంది. ఒక ఆర్ధిక సంవత్సరంలో ఒకసారి మాత్రమే, ప్రభుత్వ సెలవు దినముగా ప్రకటించబడిన | పండుగకు యీ అడ్వాన్సు యివ్వబడుతుంది. అది 10 సమాన వాయిదాలలో రికవరీ చేయబడుతుంది. వివాహ అడ్వాన్సు : 2015 పీఆర్సీలో పురుష ఉద్యోగి వివాహమునకు లేక ఉద్యోగి కుమారుని వివాహమునకు రూ. 1,25,000 చొప్పునను, మహిళా ఉద్యోగి వివాహమునకు లేక ఉద్యోగి కుమార్తె వివాహమునకు రూ.2,00,000 లు చొప్పున వివాహ అడ్వాన్సు మంజూరు చేయబడుతుంది. 4వ తరగతి ఉద్యోగులైతే పురుషులకు రూ. 75,000, స్త్రీలకు రూ. 1,00,000 మంజూరు చేయబడుతుంది. అడ్వాన్సు మొత్తం 70 వాయిదాలలోను, వడ్డీ 10 వాయిదాలలోను రికవరీ చేయబడుతుంది. వడ్డీ రేటు 4వ తరగతి ఉద్యోగులకు 5%, ఇతరులకు 5.5%గాను ఉంటుంది.
విద్యా అడ్వాన్సు : 2015 పీఆర్సీ స్కేళ్ళలో ఉద్యోగులకు రూ.7,500/-ల చొప్పున మంజూరు చేయబడుతుంది. కనీసం 2 సం||ల సర్వీసు గల రెగ్యులర్ ఉద్యోగులు అర్హులు. తమ పిల్లల విద్యా ఫీజుకై మరియు పాఠ్య పుస్తకముల | కొనుగోలు నిమిత్తం యీ అడ్వాన్సు కొరకు నిర్ణీత ఫారంలో దరఖాస్తు చేయాలి. గమనిక : ఉద్యోగి మరణించిన సందర్భంలో పై 3 రకాల అడ్వాన్సుల తాలూకు రికవరీలు రద్దు చేయబడతాయి.
Comments
Post a Comment