AP Govt Pension Rules | ఆంధ్రప్రదేశ్ రివైజ్డ్ పెన్షన్ రూల్సు

AP Govt Pension Rules  ఆంధ్రప్రదేశ్ రివైజ్డ్ పెన్షన్ రూల్సు  G.O. (P) No. 88 Fin & Plg. Dt 26-3-1980  

అర్షదాయక సర్వీసు:

 18 సం॥ వయస్సులోపు చేసిన సర్వీసు, అనారోగ్యం లేదా ఉన్నత విద్య కారణాలుకాక ఇతర కారణాలపై మంజూరైన జీతనష్టపు సెలవులో 36 నెలలకు మించిన కాలము, శిక్షగా నిర్ణయించిన నస్పెన్షన్ కాలము, కోర్టు స్టే పైన లేదా విద్యా సంవత్సరాంతం వరకు సర్వీసులో కొనసాగిన కాలము సర్వీసుగా పరిగణింపబడవు. (రూలు 13,21,23) మిగతా మొత్తం సర్వీసుగా పరిగణించబడుతుంది.?" రెండుకంటే ఎక్కువ దఫాల ప్రభుత్వేతర, ప్రభుత్వ సర్వీసుల మధ్య అంతరాయాలు, రెండు దఫాల ప్రభుత్వేతర సర్వీసుల మధ్య అంతరాయాలు ఆటోమేటిక్ గా కండోన్ చేయబడతాయి. (రూలు 28), సర్వీసు 33 సం॥లకు తగ్గితే 5 సం॥లు (జిష్. ఎంఎస్.నం. 100 ఆర్ధిక, తేది. 06.04.2010) మించకుండా వెయిటేజీ ఇవ్వబడుతుంది. (రూలు 29)

AP Govt Pension Rules | ఆంధ్రప్రదేశ్ రివైజ్డ్ పెన్షన్ రూల్సు  

పెన్షన్: 

10 సం||లు ఆపైగల సర్వీసుకు మాత్రమే పెన్షన్ చెల్లించబడుతుంది. చివరి నెల వేతనం x 1/2 అర్థ సం|| సర్వీసు యూనిట్లు > 66 అను సూత్రం ప్రకారం పెన్షన్ నిర్ణయించబడుతుంది. పైసలెన్సున్నా పై రూపాయికి సవరించబడుతుంది. చివరి నెల వేతనం కేవలం బేసిక్ పే గా మాత్రమే పరిగణించబడుతుంది. దానికి రిటైర్మెంటు మరుసటి రోజుగల ఇంక్రిమెంటును కూడా చేర్చి పరిగణించాలి. 3 నెలలు, ఆపైనవున్న సర్వీసును ఒక అర్థ సం॥ యూనిటుగా పరిగణించబడుతుంది. (రూలు 45).

సర్వీసు గ్రాట్యుటీ : 

10 సం॥లలోపు సర్వీసు వుంటే, పెన్షన్ బదులు ఏదాది సర్వీసుకు 1 నెల వేతనం చొప్పున (రూలు 45 -(1)లోని పట్టిక ప్రకారం) సర్వీసు గ్రాట్యుటీ చెల్లించబడుతుంది.

రిటైర్మెంటు గ్రాట్యుటీ:

 5 సం॥లకు మించిన సర్వీసుతో రిటైరైన ఉద్యోగికి (చివరి నెల వేతనం + డిఏ) అర్జ సం|| సర్వీసు యూనిట్లు × 1/4 అను సూత్రం ప్రకారం (చివరి నెల వేతనం + డిఏ కి 16.5 రెట్లు గరిష్ట పరిమితితో 12,00,000 రూపాయలకు మించకుండా గ్రాట్యుటీ చెల్లించబడుతుంది. గ్రాట్యుటీ మొత్తంలోని పైసలను పై రూపాయికి సవరించాలి (రూలు 46) జిఓ నం, 6 ఫైనాన్స్, తేది, 11.01.2016. 

డెత్ గ్రాట్యుటీ:

 1సం||లోపు సర్వీసుతో మరణిస్తే 3 సం॥లు సర్వీసు చేసినట్లు భావించి చివరి వేతనానికి 1 1/2రెట్లు, 5 సం॥ లోపు సర్వీసుతో మరణిస్తే 9సం॥లు సర్వీసు చేసినట్లు భావించి 4 1/4 రెట్లు, 5సం॥ పైబడి సర్వీసుంటే 18సం॥లు సర్వీసు చేసినట్లు భావించి 9రెట్లు, 18సం॥లకు మించి సర్వీసుంటే పై సూత్రం ప్రకారం డెత్ గ్రాట్యుటీగా చెల్లించబడుతుంది. (రూలు 46(3).

గ్రాట్యుటీ నామినేషన్- చెల్లింపు: 

1, భార్య, 2, భర్త, 3, కుమారులు, 4. అవివాహిత కుమార్తెలు, 5. విధవరాళ్ళయిన కుమార్తెలు, 6. | తండ్రి, 7. తల్లి, 8, 18 సం॥లలోపు వయస్సున్న సోదరులు, 9. అవివాహిత / విధవరాళ్ళయిన అక్క చెల్లెళ్ళు, 10. వివాహిత కుమార్తెలు, 11. ముందే చనిపోయిన కుమారుని సంతానం- వీరు కుటుంబ సభ్యులు. ఉద్యోగంలో చేరగానే వీరిలో ఒకరినిగాని ఎక్కువ మందిని గాని పేర్కొంటూ నామినేషన్ ఇవ్వాలి. నామినేషన్ లేకపోతే 1 నుండి 4లోని వారికి, అట్టివారు లేకపోతే 5 నుండి 11లోని వారికి సమాన వాటాల్లో చెల్లించబడుతుంది. (రూలు 46,47) గ్రాట్యుటీ చెల్లింపు 3 నెలలు మించి ఆలస్యమైతే 7%, 1 సం॥ మించి అలస్యమైతే 10% వడ్డీ చెల్లించబడుతుంది. 

కుటుంబ పెన్షన్:

 కనీసంగా 7 సం॥ల సర్వీసుతో ఉద్యోగి మరణించినప్పుడు అతని చివరి వేతనంలో 50% చొప్పునను, రిటైరైన పిదప మరణించినచో అతని చివరి వేతనములో 50%ను అతని పెన్షన్కు మించకుండా మంజూరు చేయబడుతుంది. ఉద్యోగి మరణించిన తేదీ నుండి 7 సం॥ల వరకుగాని అతను జీవించివుంటే 65 సం॥ వయస్సు నిండే వరకుగాని (ఏది ముందైతే అంతవరకు) చెల్లించబడుతుంది. ఆ తర్వాత నుండి చివరి వేతనంలో 30% చెల్లించబడుతుంది. 7 సం॥ల కనీస సర్వీసు లేకుండా సర్వీసులో మరణిస్తే మొదటి నుండి 30% చొప్పున చెల్లించబడుతుంది. 

కుటుంబ పెన్షన్ చెల్లింపు:

 నామినేషన్ అవసరం లేదు. ముందుగా భార్య / భర్తకు జీవితాంతం లేదా పునర్వివాహం వరకు, ఆ తర్వాత కుమారులకు 25 సం|| వయస్సు వచ్చేవరకు, అటు తర్వాత కుమార్తెలకు 25 సం॥ల వయస్సు వచ్చే వరకు చెల్లించ బడుతుంది. వీరిలో అర్హులు లేనప్పుడు ఉద్యోగి రిటైర్మెంటుకు ముందు లేదా తదుపరి వితంతువులైన/ విడాకులు పొందిన ఆధారిత కుమార్తెలకు పునర్వివాహం | అయ్యే వరకు (వితంతు కుమార్తెలకు సంతానం లేకపోతే పునర్వివాహం తర్వాత కూడా) కుటుంబ పింఛను చెల్లించబడుతుంది. ప్రాధాన్యతా క్రమంలో పైన తెలిపిన వారిలో అర్హులు లేకుంటే ఆధారిత తల్లిదండ్రులకు చెల్లించబడుతుంది. దివ్యాంగులైన పిల్లలకు వివాహాం అయినప్పటికీ జీవితాంతము కుటుంబ పెన్షన్ (జిఓ 221; తేది.21.11.2016) చెల్లించబడుతుంది. కుటుంబ పెన్షనర్ స్వతహాగా ఉద్యోగి అయినా పెన్షనర్ అయినా, కుటుంబ పెన్షన్ పొందవచ్చు. కుటుంబ పెన్షన్ను సాధారణంగా ఒకే సమయంలో ఒకరికి మించి చెల్లించరు (రూలు, 50), కుటుంబ పెన్షనర్ స్వతహాగా ఉద్యోగి అయితే జీతం మరియు పెన్షన్పై లేదా రెండు పెన్షన్లపై డిఏ చెల్లిస్తారు. కుటుంబ పెన్షనర్ కారుణ్య నియామకం పొందితే ఒక డివి మాత్రమే (జిఓ 51 ఆర్ధిక, తేది. 05.08.2015) చెల్లించబడుతుంది. రెండు ఫ్యామిలీ పెన్షన్ల గరిష్ట మొత్తం రూ.27,830/- కి మించి చెల్లించరు.

పెన్నను దరఖాస్తు:

 రిటైర్మెంటుకు 18 నెలలు ముందుగానే దరఖాస్తు చేయవచ్చు. జిఓ 263 ఆర్ధిక, తేది. 23.11.1998 ద్వారా సులభతరం చేయబడిన ఫార్మల్ అప్లికేషన్, ఎబిసి ఫారాలు, నామినేషన్లు, డిక్లరేషన్లను 4 సెట్లు ఉద్యోగి కార్యాలయాధిపతికి దాఖలు చేస్తే వాలే పెన్షన్ మంజూరు చేసి ఎజికి పంపిస్తారు.

Comments

Popular posts from this blog

Bank of Baroda Recruitment Notification | బ్యాంక్ ఆఫ్ బరోడా లో ఉద్యోగ అవకాశాలు

రైల్వేలో 5647 అప్రెంటిస్ పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల

TET Results | ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (AP TET) 2024 ఫలితాలు

AP Govt Leave Rules | ఆంధ్రప్రదేశ్ సెలవు నిబంధనలు

Teachers Welfare Fund ఉపాధ్యాయ సంక్షేమ నిధి